శివ నాయక్‌కు మద్దతుగా ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారం
NGKL: అచ్చంపేట మండలం రంగాపూర్‌లో కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి నేనావత్ శివ నాయక్‌కు మద్దతుగా ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ సోమవారం ప్రచారంలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. స్థానిక సమస్యలు తెలిసిన వ్యక్తిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. మీలో ఒక్కరైన శివ నాయక్ గెలుపు అవసరమన్నారు.