కార్యకర్త కుటుంబానికి మండల అధ్యక్షుడు పరామర్శ

మంచిర్యాల: బెల్లంపల్లి మండలంలోని బట్వాన్ పల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త సంకూరి సతీష్ కుటుంబ సభ్యులను కాంగ్రెస్ పార్టీ బెల్లంపల్లి మండల అధ్యక్షుడు సింగతి సత్యనారాయణ పరామర్శించారు. సతీష్ ఇటీవల మృతి చెందగా శనివారం రాత్రి వారి ఇంటికి వెళ్లి చిత్రపటం వద్ద నివాళులు అర్పించారు. కుటుంబ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం అందించారు.