నేవీ గూఢచర్యం కేసు.. ఇద్దరికి జైలు శిక్ష
AP: నేవీ రహస్యాలను పాకిస్తాన్‌కు చేరవేసిన ఇద్దరికి జాతీయ దర్యాప్తు సంస్థ ప్రత్యేక కోర్టు జైలు శిక్ష విధించింది. దోషుల అశోక్, వికాస్‌కు ఐదేళ్ల 11 నెలల జైలుశిక్ష విధిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. గూఢచర్యం కేసులో ఎన్ఐఏ 15 మందిని అరెస్ట్ చేసింది. వీరిలో ఇప్పటికే 8 మందికి శిక్ష ఖరారైంది. మిగిలిన నిందితులపై విచారణ కొనసాగుతుంది.