చమురుపై భారత్‌కు మరిన్ని ఆఫర్లు ఇస్తాం: రష్యా

చమురుపై భారత్‌కు మరిన్ని ఆఫర్లు ఇస్తాం: రష్యా

పాశ్చాత్య దేశాల అడ్డంకులు ఉన్నా తమ దేశం భారత్‌కు అతి పెద్ద చమురు సరఫరాదారుగా ఉందని రష్యా రాయబారి డెనిస్ వెల్లడించారు. ఇంధన వనరుల కొనుగోలుపై భారత్‌కు మరిన్ని ఆఫర్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఆంక్షలు ఉన్నా భారత్‌కు చమురు సరఫరాదారుగా రష్యా ఉంటుందన్నారు. కాగా రష్యా చమురు కొనుగోళ్లు ఆపాలని భారత్‌పై పలు దేశాలు ఒత్తిడి చేస్తున్నాయి.