ముల్లంగిలో వినయ్ కుమార్ రెడ్డి విస్తృత ప్రచారం
NZB: సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో మాక్లూర్ మండలం ముల్లంగి గ్రామంలో కాంగ్రెస్ ఆర్మూర్ నియోజకవర్గ ఇంఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి విస్తృత ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ తిరుగుతూ కాంగ్రెస్ మద్దతుదారుడైన సర్పంచ్ అభ్యర్థి సల్మాన్‌కు ఓటు వేసి గెలిపించాలని కోరారు. అదేవిధంగా మండలంలోని ఒడ్యాట్ పల్లిలో సర్పంచ్ అభ్యర్థి ప్రవీణ్ తరపున ప్రచారం నిర్వహించారు.