బీజేపీ మండల అధ్యక్షుడిగా రమేశ్ యాదవ్

బీజేపీ మండల అధ్యక్షుడిగా రమేశ్ యాదవ్

KNR: జమ్మికుంట మండలంలోని మాచినపల్లి గ్రామానికి చెందిన దొంతరవేన రమేశ్ యాదవ్‌ను బీజేపీ మండల అధ్యక్షుడిగా నియమించారు. ప్రస్తుతం వోబీసీ నాయకుడిగా, ఉప సర్పంచ్ ఫోరం అధ్యక్షుడిగా ఆయన ఉన్నారు. ఈ సందర్భంగా రమేశ్ యాదవ్ మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచిన బీజేపీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తానని తెలిపారు.