ఊరందూరు హరిజనవాడలో పర్యటించిన ఎమ్మెల్యే
TPT: శ్రీకాళహస్తి(మం) ఊరందూరు హరిజనవాడలో మంగళవారం ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం స్థానిక ప్రజలతో కలిసి వారి సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. ప్రజల వినతులను, సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.