చికిత్స పొందుతూ యువకుడు మృతి
JGL: బీర్పూర్ మండలం మంగేళ గ్రామానికి చెందిన గంగి విష్ణువర్ధన్ అనే యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై రాజు తెలిపారు. ఈ నెల 16న కమ్మునూరు నుంచి మంగేళకు స్కూటీపై వెళ్తుండగా అదుపు తప్పి పడిపోవడంతో తలకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. మృతుని తల్లి పుష్పలత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.