బస్సు ప్రమాదంపై కీలక విషయాలు వెల్లడించిన ఎస్పీ

బస్సు ప్రమాదంపై కీలక విషయాలు వెల్లడించిన ఎస్పీ

KRNL: కర్నూలు శివారు చిన్నటేకూరు వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మృతి చెందిన బైకర్ శివశంకర్ మద్యం తాగి వాహనం నడిపినట్లు RFSL నివేదికలో తేలిందని ఆదివారం ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. మృతుడి విస్సెరా నమూనాలో మద్యం ఆనవాళ్లు ఉన్నట్లు నివేదిక స్పష్టం చేసిందని ఎస్పీ పేర్కొన్నారు.