'సొంత పార్టీ నాయకులకు న్యాయం చేసి మాట్లాడాలి'

KDP: మైదుకూరు మాజీ ఎమ్మెల్యే తన సొంత పార్టీ నాయకులకు న్యాయం చేసి టీడీపీ వారి గురించి మాట్లాడాలని మార్కెట్ యార్డ్ ఛైర్మన్ ఏపీ రవీంద్ర అన్నారు. శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే రఘురాం రెడ్డి మార్కెట్ యార్డ్ ఛైర్మన్ పదవి జగన్‌కు ఇవ్వాల్సిందని పేర్కొనడం ఏమాత్రం సమంజసంగా లేదన్నారు.