బోయపాలెం వద్ద రోడ్డు ప్రమాదం
PLD: ఎడ్లపాడు మండలం బోయపాలెం వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పి ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఉన్నవ స్పిన్నింగ్ మిల్లు కార్మికుడు విక్రమ్ హరీష్ సాయిబాలాజీ తీవ్రంగా గాయపడ్డాడు. అతను మిత్రునితో కలిసి బైక్‌పై వెళ్లే క్రమంలో బైక్ అదుపుతప్పింది. దీంతో వెనుక కూర్చున్న విక్రమ్ ఒక్కసారిగా కింద పడిపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు.