'అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలి'

'అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలి'

తిరుపతి జిల్లా గూడూరులోని సీపీఐ కార్యలయంలో ఈ నెల 24న జరగనున్న రాష్ట్రవ్యాప్త ఆందోళనకు సంబంధించిన గోడపత్రికలను జిల్లా కార్యవర్గ సభ్యుడు ప్రభాకర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అర్హులైన పేదలకు ఇళ్లస్థలాలు వెంటనే కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరారు. గూడూరులో నిర్వహించే ధర్నాను పార్టీ నాయకులు విజయవంతం చేయాలన్నారు.