VIDEO: ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే ఉగ్ర

VIDEO: ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే ఉగ్ర

ప్రకాశం: కనిగిరి పట్టణంలోని ఆర్టీసీ డిపో ప్రాంగణంలో మూడు నూతన ఆర్టీసీ బస్సులను ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి గురువారం ప్రారంభించారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కాలం చెల్లిన ఆర్టీసీ బస్సుల స్థానంలో నూతన బస్సులను ఏర్పాటు చేస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. నూతన ఆర్టీసీ బస్సులను ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు.