ఈనెల 20 నుంచి పిల్లల సర్వే
NGKL: అచ్చంపేటలో బడిఈడు పిల్లలు పాఠశాలల్లో 100% పూర్తయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. చదువు మధ్యలో ఆపేసిన వారు, పనులు చేయించుకుంటున్న వారి వివరాలను సేకరిస్తుంది. 2026-27 ఏడాదికి సంబంధించి ఈ నెల 20 నుంచి వచ్చే నెల 31 వరకు పిల్లలను గుర్తించేందుకు సర్వే చేయనున్నారు. దీని ద్వారా గుర్తించిన వారిని వచ్చే సంవత్సరం పాఠశాలల్లో చేర్పిస్తారు.