'ఉపాధి హామీ పనుల్లో కూలీల సంఖ్య పెంచాలి'

'ఉపాధి హామీ పనుల్లో కూలీల సంఖ్య పెంచాలి'

అన్నమయ్య: తంబళ్లపల్లెలో నిన్న జరిగిన సమావేశంలో జిల్లా PD వెంకటరత్నం ఉపాధి హామీ పనులలో పనిచేసే కూలీల సంఖ్యను పెంచాలని అధికారులను ఆదేశించారు. క్షేత్ర సహాయకులు ప్రతి గ్రామంలో పర్యటించి, జాబ్ కార్డ్ కలిగిన ప్రతి ఒక్కరినీ పనికి వచ్చేలా అవగాహన కల్పించాలని సూచించారు. ఉపాధి చట్టం ద్వారా 125 రోజులు పనిదినాల పెంపు, వారానికి 4 గంటల పనికి వేతనాలు చెల్లింపు వంటి సూచనలు ఇవ్వాలన్నారు.