ఈ నెల 27న దుకాణాల వేలం పాట
CTR: బంగారుపాళెం మండలంలోని మొగిలి శివాలయానికి సంబందించిన వివిధ దుకాణాలను లీజుకు ఇవ్వడానికి 27న వేలం పాటలు నిర్వ హించనున్నట్లు ఈవో మునిరాజు తెలిపారు. వాహనాల పార్కింగ్, పాదరక్షలు భద్రపరుచుట, కొబ్బరి చిప్పలు, తలనీ లాలు ప్రోగు చేసుకునే హక్కుకు సంబందించి వేలం పాటలు నిర్వహిస్తామని వెల్లడించారు. ఆలయావరణంలో పది తాత్కాలిక దుకాణాలకు వేలం ఉంటుందన్నారు.