చిన్నమండెంలో ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి
అన్నమయ్య: చిన్నమండెం మండలం జల్లా వాండ్లపల్లి సమీపంలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారుకు దారి ఇచ్చే క్రమంలో ట్రాక్టర్ ట్రాలీని ఢీకొన్న అజయ్ కుమార్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు రాయచోటి పట్టణం ఏజీ గార్డెన్‌కు చెందినవాడు. ఈ ఘటపై చిన్నమండెం పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.