VIDEO: ప్రసాద క్షేత్రాన్ని దర్శించిన హిమవాహిని రత్నాకర్
సత్యసాయి బాబా 100వ జన్మదిన వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన మహా ప్రసాద క్షేత్రాన్ని హిమవాహిని రత్నాకర్ సందర్శించారు. అక్కడ వేలాది మంది భక్తులకు శుభ్రంగా, నాణ్యతతో భోజనం అందిస్తున్న స్వచ్ఛంద సేవకులను ఆమె ప్రత్యేకంగా అభినందించారు. నాణ్యత, క్రమశిక్షణతో కూడిన ఈ సేవ, భగవాన్ ప్రేమ సందేశానికి ప్రతీకగా నిలుస్తోందని ఆమె ప్రశంసించారు.