'యంగ్ ఇండియా పాఠశాల నిర్మాణాన్ని వేగవంతం చేయాలి'
నల్లగొండ పట్టణంలోని ఎస్ఎల్బీసీ కాలినీ వద్ద నిర్మాణంలో ఉన్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల పనులను, త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. శుక్రవారం రాత్రి నూతనంగా నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు.