క్రికెట్ బెట్టింగుపై కఠిన చర్యలు: ఎస్పీ
VZM: ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ క్రికెట్ బెట్టింగులు నిర్వహించినా, పాల్గొన్నా కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ మంగళవారం హెచ్చరించారు. ఐపీఎల్ మ్యాచ్‌లు జరుగుతున్న నేపథ్యంలో యువత బెట్టింగుల జోలికి పోవద్దని సూచించారు. బెట్టింగులు చట్టవిరుద్ధమని, ఇందులో పాల్గొనే వారిపై కేసులు నమోదు చేసి రౌడీ షీట్లు కూడా తెరవనున్నట్లు తెలిపారు.