డ్రైవర్లకు అవగాహన కల్పించిన ఎస్ఐ

డ్రైవర్లకు అవగాహన కల్పించిన ఎస్ఐ

NTR: రోడ్డు ప్రమాదాలపై గుడివాడ రూరల్ ఎస్ఐ చంటి బాబు రాత్రి టిడ్‌కో గృహాల ఆవరణంలో ఆటో డ్రైవర్ల యూనియన్లకు రోడ్డు సేఫ్టీపై అవగాహన సదస్సు నిర్వహించారు. రోడ్డుపై ప్రయాణిస్తున్నప్పుడు నిబంధనల ప్రకారం నడుచుకోవాలని సూచించారు. ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరు సహకరించాలన్నారు. ఆటోలలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకుని ఆటో నడపకూడదని హెచ్చరించారు.