బ్రహ్మంసాగర్కు 6 టీఎంసీల నీరు చేరిక

KDP: బ్రహ్మంసాగర్ జలాశయానికి 6 టీఎంసీల నీరు చేరింది. ప్రాజెక్టు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ నాగేశ్వరరావు మాట్లాడుతూ.. వెలుగోడు జలాశయం నుంచి 1,400 క్యూసెక్కుల మీరు రాగా, కుడి ఎడమ కాలువకు, థర్మల్ ప్రాజెక్టుకు 380 క్యూసెక్కుల నీరు విడుదల చేశామన్నారు. రైతులు నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు.