ఆర్త జన బంధువు మండలి వెంకట కృష్ణారావు

కృష్ణా: 1977 దివిసీమ ఉప్పెన బాధితుల ఆకలి తీర్చిన ఆర్త జన బంధువు మండలి వెంకట కృష్ణారావు అని టీడీపీ తెలుగు మహిళ జిల్లా అధ్యక్షురాలు తలశిల స్వర్ణలత అన్నారు. ఆదివారం నాగాయలంకలో ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి స్వర్గీయ మండలి వెంకట కృష్ణారావు శత జయంతి ఘనంగా జరిగాయి. కృష్ణారావు విగ్రహానికి ఎమ్మెల్యే అల్లుడు శీలం అశ్విన్ కుమార్ పూలమాలతో నివాళులర్పించారు.