పెట్రోల్ కొరత లేదు: బండి సంజయ్
TG: రాష్ట్రంలో పెట్రోల్ కొరత లేదని కేంద్రమంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వదంతులను నమ్మొద్దని సూచించారు. పరిమితికి మించి పెట్రోల్ కొంటే కృత్రిమ కొరత ఏర్పడుతుందని తెలిపారు. ఆయిల్ కంపెనీల దగ్గర సరిపడా నిల్వలున్నాయని చెప్పారు. పెట్రోల్, డీజిల్ సరఫరాలో ఇబ్బందులు లేవని పేర్కొన్నారు.