'క్రీడా పాఠశాలలో ప్రవేశాలను సద్వినియోగం చేసుకోవాలి'
NRML: విద్యార్థులు క్రీడా పాఠశాలలో ప్రవేశాలను సద్వినియోగం చేసుకోవాలని DYSO శ్రీకాంత్ రెడ్డి అన్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు స్పోర్ట్స్ స్కూల్లో 4వతరగతి ప్రవేశానికి మండల స్థాయి ఎంపిక పోటీలను సోమవారం నిర్వహించారు. విద్యార్థులకు వివిధ టెస్టులను నిర్వహించి అర్హులైన వారిని జిల్లా స్థాయికి ఎంపిక చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ పద్మ, పీడీ సత్తయ్యలు పాల్గొన్నారు.