VIDEO: రైతులు కష్టాలు పడుతుంటే అందాల పోటీలా:మాజీమంత్రి

WNP: రైతులు అనేక కష్టాలుపడుతుంటే పట్టించుకోని రాష్ట్రప్రభుత్వం అందాలపోటీలు నిర్వహించడంలో శ్రద్ధచూపుతున్నారని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి విమర్శించారు. కొనుగోలు కేంద్రాలలో రైతుల ఇబ్బందులపై ఇవాళ ఆయన స్పందించారు. వరిధాన్యం కొనుగోలు విషయంలో ఎదురవుతున్న ఇబ్బందులతో రైతులు స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి ధర్నాలు నిర్వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.