నేటి నుంచి చౌడేపల్లెలో బ్రహ్మోత్సవాలు

నేటి నుంచి చౌడేపల్లెలో బ్రహ్మోత్సవాలు

చిత్తూరు: చౌడేపల్లె బజారు వీధిలోని శ్రీఅభీష్టద మృత్యుంజయేశ్వరస్వామి ఆలయంలో నేటి నుంచి మే 14వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో కమలాకర్ తెలిపారు. ఇందులో భాగంగా రోజుకో అలంకరణలో శివపార్వతులు దర్శనమిస్తారు. రోజూ గ్రామంలో ఊరేగింపు ఉంటుంది. ఈ మేరకు బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి చేశారు.