పాక్‌తో మ్యాచ్‌పై పహల్గామ్ బాధితురాలి ఆవేదన

పాక్‌తో మ్యాచ్‌పై పహల్గామ్ బాధితురాలి ఆవేదన

ఆసియా కప్‌లో భాగంగా జరగనున్న భారత్-పాక్ మ్యాచ్ విషయంలో బీసీసీఐ నిర్ణయాన్ని పహల్గామ్ ఉగ్రదాడిలో భర్తను కోల్పోయిన బాధితురాలు ఐషాన్య ద్వివేది ఖండించారు. మ్యాచ్ ఆడాలని క్రికెటర్లను బలవంతపెట్టొద్దని సూచించారు. అసలు మ్యాచ్‌కి బీసీసీఐ అంగీకరించకుండా ఉండాల్సిందన్నారు. పహల్గామ్ దాడిలో తమ కుటుంబసభ్యులను కోల్పోయిన బాధిత కుటుంబాల వేదనను అప్పుడే మరచిపోయారా అని నిలదీశారు.