యుద్ధం.. అప్రమత్తమైన భారత నౌకాదళం

యుద్ధం.. అప్రమత్తమైన భారత నౌకాదళం

పశ్చిమాసియాలో యుద్ధం దృష్ట్యా భారత నౌకాదళం అప్రమత్తమైంది. పర్షియన్ గల్ఫ్‌లో ప్రస్తుతం 24 భారత యుద్ధనౌకలు మోహరించినట్లు భారత్ నేవీ వెల్లడించింది. గల్ఫ్ నుంచి భారత్‌కు వచ్చే వాణిజ్య నౌకలకు భద్రతే లక్ష్యమని తెలిపింది. 24 నౌకల్లో 668 మంది భారతీయ నావికులు ఉన్నట్లు పేర్కొంది. జలసంధికి తూర్పువైపున మరో 3 నౌకలు.. వాటిలో 76 మంది నావికులు ఉన్నట్లు ప్రకటించింది.