'విద్యార్థులు విద్యా ప్రమాణాలను చేరుకోవాలి'

'విద్యార్థులు విద్యా ప్రమాణాలను చేరుకోవాలి'

PDPL: ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో కనీసం 90% మంది విద్యార్థులు విద్యా సంవత్సరం ముగిసేలోపు కనీస విద్యా ప్రమాణాలను చేరుకోవాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సూచించారు. కలెక్టరేట్లో హెడ్మాస్టర్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులలో చదవడం, రాయడం, లెక్కల నైపుణ్యాలపై ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు.