భర్తపై వేడినీరు వేసిన భార్య

భర్తపై వేడినీరు వేసిన భార్య

AKP: అనకాపల్లి మండలం తుంపాలలో భర్తపై భార్య వేడి నీరు పోసి గాయపరిచింది. భర్త చంద్రశేఖర్‌ను ఇల్లరికం రావాలని భార్య లోకేశ్వరి ఒత్తిడి తీసుకువస్తుంది. భర్త నిరాకరించడంతో లోకేశ్వరి వేడి నీరు పోసినట్లు సీఐ విజయ్ కుమార్ శనివారం తెలిపారు. గాయపడిన భర్త అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ పేర్కొన్నారు.