దరఖాస్తుకు ఇవాళే ఆఖరి తేదీ

NLG: వైద్యఆరోగ్య శాఖ పరిధిలోని కాంట్రాక్టు పద్ధతిన పీడియాట్రీషియన్(1), మెడికల్ ఆఫీసర్(4) పోస్టులకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి ఇవాళ సాం 5 గంటల వరకు గడువు ఉందని DMHO డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. పీడియాట్రిషన్ పోస్టుకు ఎండీ పీడియాట్రిషన్, మెడికల్ ఆఫీసర్ MBBS అర్హత కలిగి ఉండాలన్నారు. రేపు ఉదయం 10గం కలెక్టరేట్‌ల్లో ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తామన్నారు.