ఏబీఎన్ కార్యాలయంపై వైసీపీ దాడిని ఖండించిన మంత్రి

ఏబీఎన్ కార్యాలయంపై వైసీపీ దాడిని ఖండించిన మంత్రి

ప్రకాశం: ఏబీఎన్ కార్యాలయంపై వైసీపీ శ్రేణుల దాడిని మంత్రి స్వామి మంగళవారం ఖండించారు. ప్రజాస్వామ్యానికి మూలస్తంభమైన మీడియాపై ఇలాంటి దాడులు చేయడం అత్యంత గర్హనీయమని ఆయన మండిపడ్డారు. నిజాలను నిర్భయంగా ప్రజల ముందుకు తీసుకు వస్తున్న ఏబీఎన్ ఛానల్ గొంతు నొక్కాలని చూడడం జగన్ అరాచక పాలనకు నిదర్శమని విమర్శించారు.