సిమెంట్ రోడ్డు మంజూరు చేయాలంటూ రోడ్డెక్కిన గిరిజనులు

VZM: బొడ్డవర నుండి గుణపాడు వరకు సిమెంట్ రోడ్డు మంజూరు చేయాలని గ్రామస్తులు గ్రామ సచివాలయం ఎదురుగా మొక్కలు ఆకులు పట్టుకొని నిరసన తెలియజేశారు. రోడ్లు లేక గిరి శిఖర గ్రామాల నుంచి వారు డోలు మోతలతో ఇబ్బందికి గురవుతున్నామని గ్రామస్తులు వాపోయారు. రోడ్డు మంజూరు చేసేంతవరకు పోరాడుతామని గిరిజన నాయకులు గిరీష్ పేర్కొన్నారు.