పంట పొలాలు పరిశీలించనున్న కేసీఆర్

SRPT: తుంగతుర్తి నియోజకవర్గంల్ ఆదివారం మాజీ సీఎం కేసీఆర్ పర్యటించనున్నట్లు ఆ పార్టీ శ్రేణులు తెలిపారు. ఉదయం 11గంటలకు తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలో జనగామ జిల్లా నుంచి చేరుకోనున్న ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశారు. తుంగతుర్తి మండలం వెలుగుపల్లి ప్రాంతంలో ఎండిన పంట పొలాలను పరిశీలించడానికి కేసీఆర్ రానున్నారు.