విద్యార్థులకు ప్యాడ్లు అందించిన ఏబీవీపీ

విద్యార్థులకు ప్యాడ్లు అందించిన ఏబీవీపీ

GDWL: అయిజ మండలంలోని ప్రభుత్వ బాలికల, బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఏబీవీపీ ఆధ్వర్యంలో ఉచితంగా ఎగ్జామ్ ప్యాడ్లను పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. మార్చి 14 నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలకు విద్యార్థులు కష్టపడి సిద్ధం కావాలని కోరారు. పదవ తరగతి ఫలితాల్లో అయిజ మండలం జిల్లాలోనే అగ్రస్థానంలో నిలవాలని విద్యార్థులను ప్రోత్సహించారు.