పోతిరెడ్డిపల్లిలో దుర్గంధం
SDPT: చేర్యాల మండలం పోతిరెడ్డిపల్లి 8వ వార్డులో మురుగు కాలువలు నిండిపోయి దుర్గంధం వెదజల్లుతున్నాయి. నిత్యం రైతులు, ప్రజలు తిరిగే ఈ దారిలో దోమలు, చీడపురుగులు విజృంభిస్తుండటంతో డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, వెంటనే కాలువలను శుభ్రం చేయించాలని అన్నారు