మాజీ సీఎం జగన్‌తో ఉమ్మడి జిల్లా నేతల భేటీ

VZM: మాజీ సీఎం వైఎస్ జగన్‌తో తాడేపల్లిలో ఉమ్మడి విజయనగరం జిల్లా వైసీపీ నేతలు మంగళవారం భేటీ అయ్యారు. ఆయన అధ్యక్షతన జరిగిన పీఏసీ సమావేశానికి మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య తదితరులు హాజరయ్యారు. సమావేశం అనంతరం జగన్‌ను కలిసి జిల్లాలో తాజా రాజకీయ పరిస్థితులను వివరించారు.