జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శిగా ముత్తారెడ్డి
ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా చింతలపూడి మండలం ఎర్రంపల్లికి చెందిన జగ్గవరపు ముత్తారెడ్డి ఎంపికయ్యారు. గతంలో చింతలపూడి ఏఎంసీ ఛైర్మన్‌గా పనిచేసిన ముత్తారెడ్డి పార్టీ స్థాపించినప్పటి నుంచి గెలుపు కోసం అహర్నిశలు కృషి చేశారు. ఆయన సేవలను సీఎం చంద్రబాబు గుర్తించి, జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.