మణికేశ్వరంలో ఇమామ్‌లకు నూతన వస్త్రాల పంపిణీ
BPT: పవిత్ర రంజాన్ పండుగను పురస్కరించుకుని మణికేశ్వరం గ్రామంలో మసీదు ఇమామ్‌లకు గ్రామ టీడీపీ ఆధ్వర్యంలో నూతన వస్త్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. మసీదు కమిటీ సభ్యులు, గ్రామ టీడీపీ నేతలు పాల్గొన్న ఈ కార్యక్రమం సౌహార్ద వాతావరణంలో నిర్వహించబడింది.