రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
NZB: మోస్రా గ్రామ శివారులో శనివారం గుర్తుతెలియని వాహనం ఢీకొన్న ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందినట్లు వర్ని ఎస్సై వంశీకృష్ణారెడ్డి తెలిపారు. తీవ్ర గాయాలపాలైన బాధితుడిని జిల్లా ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించాడు. మృతుడి వయస్సు సుమారు 40 ఏళ్లు ఉంటుందని, ఆచూకీ తెలిసిన వారు పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.