విశాఖ కేజీహెచ్‌లో పరిశుభ్రత ర్యాలీ

VSP: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన 'స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర' కార్యక్రమంలో భాగంగా (కేజీహెచ్)లో శనివారం వర్షాకాల పరిశుభ్రతపై అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్ ఐ. వాణి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో డాక్టర్లు, నర్సులు, నర్సింగ్ విద్యార్థులు, ఇతర సిబ్బంది కలిసి ర్యాలీ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు.