'ప్రజల నుండి అర్జీలు స్వీకరించిన కలెక్టర్'
బాపట్ల జిల్లా కలెక్టరేట్‌లోని హాల్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో, జిల్లా వివిధ మండలాల నుంచి వచ్చిన అర్జీదారుల సమస్యలను స్వీకరించుకున్నారు. కలెక్టర్ వి.వినోద్ కుమార్, జాయింట్ కలెక్టర్ భావన ఈ కార్యక్రమంలో పాల్గొని అర్జీలను స్వీకరించారు. ఈ మేరకు అర్జీలను త్వరితగతిన పరిష్కరిస్తామని కలెక్టర్ తెలిపారు.