ధర్మవరంలో అర్ధరాత్రి నుంచి వర్షం

సత్యసాయి: ధర్మవరంలో అర్ధరాత్రి నుంచి వర్షం కురుస్తోంది. నిన్న ఉదయం నుంచి విపరీతమైన ఎండ కాయడంతో ప్రజలు ఉక్కపోతతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రాత్రి ఉన్నట్టుండి ఆకాశం మేఘావృతమై అర్ధరాత్రి వర్షం మొదలైంది. ఉదయం వరకు కురుస్తూనే ఉండటంతో పనులకు వెళ్లేందుకు కూలీలు ఇబ్బందులు పడ్డారు. కొద్దిసేపు విద్యుత్‌కు అంతరాయం కలిగింది.