అస్తవ్యస్తంగా టీచర్ల సర్దుబాటు

అస్తవ్యస్తంగా టీచర్ల సర్దుబాటు

ADB: గుడిహత్నూర్‌ మండలం మన్నూర్‌ ఉన్నత పాఠశాలలో 405 మంది విద్యార్థులు ఉండగా.. 17 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు. సంఖ్యను బట్టి ఇద్దరు అదనంగా ఉన్నట్లు తేల్చిన అధికార యంత్రాంగం తెలుగు, ఆంగ్లంతో పాటు మరాఠి మాధ్యమం కొనసాగుతుందనే విషయాన్ని విస్మరించారు. ఇంకా నలుగురు అవసరం కాగా, ఉన్నవారిని తొలగించడమేంటని టీచర్లు ప్రశ్నిస్తున్నారు.