WWC విజయాన్ని ‘1983’తో పోల్చనక్కర్లేదు: గవాస్కర్
భారత మహిళల వరల్డ్ కప్ గెలుపును మెన్స్ WC1983 విజయంతో పోల్చడాన్ని సునీల్ గవాస్కర్ తప్పుబట్టాడు. నాటి మెన్స్ టీమ్ కంటే ఇప్పటి ఉమెన్స్ టీమ్‌కు మంచి రికార్డ్ ఉందని, గతంలోనే 2 ఫైనల్స్ ఆడారని చెప్పాడు. కానీ పురుషుల టీమ్ 1983కి ముందు గ్రూప్ స్టేజ్‌కే పరిమితమని, అయితే ఆ విజయమే భారత్ గురించి అందరూ మాట్లాడేలా చేసిందన్నాడు. ఇరు జట్లవి భిన్న పరిస్థితులని పేర్కొన్నాడు.