ఫోటోగ్రఫీ అవార్డు అందుకున్న మహేష్

NGKL: ఇండియన్ ఇంటర్నేషనల్ ఫోటోగ్రఫీ కౌన్సిల్, ఫోటోగ్రఫీ అకాడమి ఆఫ్ ఇండియా సంయుక్తంగా ఏపీలోని విజయవాడలో ఈ నెల 1న ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకను నిర్వహించారు. ఈ పోటీలలో పెద్దకొత్తపల్లి మండల కేంద్రానికి చెందిన పిట్టల మహేష్ తీసిన చిత్రానికిగాను ఉత్తమ ఫోటోగ్రఫీ అవార్డు అందుకున్నారు. ఈ అవార్డును డా. సుందర్ కొంపల్లి, కే మన్మధరావు, ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ అందజేశారు.