పాఠశాలకి వాటర్ ప్యూరిఫైయర్ బహుకరణ

పాఠశాలకి వాటర్ ప్యూరిఫైయర్ బహుకరణ

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం గాంధీనగర్‌లోని ప్రాథమిక పాఠశాలకి జనగామ రవళి అనంత కళ్యాణ్ వాటర్ ప్యూరిఫైయర్ని బహుకరించారు. శుక్రవారం రోజు గ్రామ సర్పంచ్ పోలు సంపత్ వాటర్ ప్యూరిఫైయర్ని ప్రారంభించారు. దాతలు ముందుకు వచ్చి గ్రామ అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, ఉపాధ్యాయులు, గ్రామస్తులు పాల్గొన్నారు.