చిన్నపిల్లల వార్డు సేవలపై కలెక్టర్ సీరియస్ ఫోకస్

చిన్నపిల్లల వార్డు సేవలపై కలెక్టర్ సీరియస్ ఫోకస్

MLG: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ దివాకర మంగళవారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయన చిన్నపిల్లల వార్డును సందర్శించి, నవజాత శిశువులకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు. వైద్య సిబ్బందికి అత్యవసర పరిస్థితుల్లో స్థానికంగానే మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని, నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు.