'పులివెందుల గడ్డపై టీడీపీ జెండా'

కోనసీమ: ఒక్క ఉప ఎన్నికలతో పులివెందుల కోట బద్దలైందనీ రాష్ట్ర అంచనాల కమిటీ ఛైర్మన్ మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు తెలిపారు. దశాబ్దాల బానిస సంకెళ్లను తెంచేసి పులివెందుల గడ్డపై టీడీపీ జెండా ఎగిరిందని శుక్రవారం ఉదయం హర్షం వ్యక్తం చేశారు. ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవానికి ఒక రోజు ముందే పులివెందుల ప్రజలకి స్వేచ్చ వచ్చిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.